Madhavaram Krishna Rao: మరో వారంలో ఇంటింటికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తాం

In Another Week We Will Provide Fresh Water Connections To Every House Says Madhavaram Krishna Rao
x

Madhavaram Krishna Rao: మరో వారంలో ఇంటింటికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తాం 

Highlights

Madhavaram Krishna Rao: రోడ్లు, మురుగు కాల్వలు, మంచినీటి సదుపాయం

Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి నియోజక వర్గంలోని బాలానగర్ డివిజన్ ఇందిరా గాంధీ నగర్ రూపు రేఖలు మార్చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధి చేసిన తర్వాత ప్రగతి నివేదన సభ నిర్వహించారు. 60 యేళ్లుగా నివాసం ఉంటున్న కాలనీ వాసుల ప్రయోజనార్థం మురుగు కాల్వల ఏర్పాటు, కాలనీకి తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. మరో వారంరోజుల్లో ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

గతంలో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇందిరానగర్ ప్రాంత వాసుల బాగోగులను పట్టించుకోలేదన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న తర్వాత ఇందిరానగర్ కు అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపట్ల విశ్వాసంతో మెజారిటీ ఓట్లతో గెలిపించేందుకు ఇందిరానగర్ వాసులు ముందుంటారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories