Revanth Reddy: కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. కేసీఆర్ గజ్వేల్‌లోనే పోటీ చేయాలి

If KCR Has Faith In His Rule He Should Contest From Gajwel
x

Revanth Reddy: కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. కేసీఆర్ గజ్వేల్‌లోనే పోటీ చేయాలి

Highlights

Revanth Reddy: కొందరు నేతలు బీఆర్ఎస్‌లోకి పోతే కాంగ్రెస్ బలహీనపడదు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లోనే పోటీ చేయాలని సవాల్ చేశారు. గద్వాలకు చెందిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. వారిని కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయిందన్నారు. కొందరు నేతలు పార్టీ మారిపోయినంత మాత్రాన కాంగ్రెస్ బలహీనపడదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. వంద రోజులు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories