Harish Rao: రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న

I Will Resign If Loan Waiver And Six Guarantees Are Implemented Says Harish Rao
x

Harish Rao: రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న

Highlights

Harish Rao: సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రావాలి

Harish Rao: తెలంగాణ పాలిటిక్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమరవీరుల స్థూపం సాక్షిగా తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య సవాళ్ల పర్వం పీక్స్‌కు చేరుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు మధ్య రుణమాఫీపై రణం నడుస్తోంది. ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే.. రుణమాఫీ చేయకుంటే రేవంత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని హరీష్‌రావు సవాల్ విసిరారు.

ఇక హరీష్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నానంటూ రేవంత్‌ ప్రతిసవాల్ చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే హరీష్‌రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు రేవంత్. రుణమాఫీ చేసి తీరుతాం.. హరీష్‌రావు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రేవంత్‌ సవాల్‌పై స్పందించిన హరీష్‌రావు రుణమాఫీతో పాటు, కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్‌రావు. ఇందులో భాగంగానే హరీష్‌రావు రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు.

గన్‌పార్క్ వద్దకు చేరుకున్న హరీష్‌రావు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే దొంగ హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్‌రావు. నిజంగా గ్యారంటీలు అమలు చేస్తారనుకుంటే సీఎం రేవంత్ గన్‌పార్క్ వద్దకు రావాలని మళ్లీ సవాల్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖ రెడీగా ఉందని స్పష్టం చేశారు హరీష్‌రావు. గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా ఇస్తానన్నారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories