పెండింగ్‌ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు.. నా పరిధికి లోబడే..

Tamilisai Soundararajan: అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను పరిశీలించి త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

Arun Chilukuri
Published on: 24 Oct 2022 5:58 PM IST
I Will Decide on Pending Bills Soon Says Governor Tamilisai Soundararajan
X

పెండింగ్‌ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు.. నా పరిధికి లోబడే..

Tamilisai Soundararajan: అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను పరిశీలించి త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా పలువురు ప్రముఖులు, బీజేపీ నాయకులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని అయితే పరిధిలోకి లోబడే నడుచుకుంటానని స్పష్టం చేశారు. త్వరలోనే పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్న తమిళి సై గవర్నర్‌గా బాధ్యతలు తెలుసని అదేవిధంగా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story