Top
logo

అందుకే అంసెబ్లీ సమావేశాలకు రాలేకపోయా : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

అందుకే అంసెబ్లీ సమావేశాలకు రాలేకపోయా : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
Highlights

భారత దేశంలో హిందూ ధర్మం, దేశ రక్షణ కోసం సైన్యాన్ని తయారు చేస్తున్నామని...,బెంగళూరులో క్యాంప్ నడుస్తోందని రాజాసింగ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయాని రాజాసింగ్ స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. భారత దేశంలో హిందూ ధర్మం, దేశ రక్షణ కోసం సైన్యాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా బెంగళూరులో క్యాంప్ నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం లేదని సీఎం కేసీఆర్ అంటున్నారని .., అసెంబ్లీ సమావేశాలకు ముందే బెంగుళూరులో క్యాంప్‌కు సంబంధించి ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్యాంప్ పది రోజులు ఉంటుందని ఆయన తెలిపారు. జాతికి ఉపయోగపడే పనిలో తాను బిజీగా ఉన్నాని .., హిందు రాష్ట్రం తమ సంకల్పమని.. అందుకే తాను అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయానని రాజాసింగ్ స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top