Hyderabad Police: ఆన్‌లైన్ వేదికగా ప్రజలను అలెర్ట్ చేస్తున్న పోలీసులు

Hyderabad Police Conducts Traffic Safety Awareness Program Through Online
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Hyderabad Police: స్పెషల్‌ వీడియోలు, మీమ్స్‌తో ప్రజల్లో అవగాహన * సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సోషల్‌మీడియా వింగ్‌ ఏర్పాటు

Hyderabad Police: ముళ్లును ముళ్లుతోనే తీయాలనే సామెతను సైబరాబాద్‌ పోలీసులు పక్కాగా ఫాలో అవుతున్నారు. జనాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వాళ్ల ఇంట్రెస్టింగ్‌ అంశాలనే ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. అవగాహనే లక్ష్యంగా సోషల్‌మీడియా వేదికగా బుల్లెట్లు విసురుతున్నారు. జాగ్రత్త సుమా అంటూ చురకలు పెడుతున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై అప్రమత్తం చేస్తూ హస్యం పండిస్తున్నారు. మరీ సైబరాబాద్‌ కమిషనరేట్ చేస్తున్న వినూత్న ప్రయత్నం ఫలిస్తుందా ప్రజలు వాటిని ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు

ప్రజలను అలెర్ట్ చేయడానికి సైబరాబాద్‌ పోలీసులు సోషల్‌మీడియాను వేదికగా మార్చుకున్నారు. స్పెషల్‌ వీడియోలు, మీమ్స్ రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఓ స్పెషల్‌ వింగ్ కూడా ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్ మోసాల నుంచి ట్రాఫిక్స్ రూల్స్ వరకు అన్నింటిని మీమ్స్‌గా రెడీ చేస్తున్నారు. ఒక్కొక్క మీమ్స్‌ని బుల్లెట్లలాగా సోషల్ ‌మీడియాలో వదులుతున్నారు. దీంతో జనాలకు చేరాల్సిన మెసేజ్ చేరిపోతోంది. క్రియేటివిటీగా ఉండే మీమ్స్‌.. మ్యాటర్‌ని ప్రజలకు ఈజీగా కన్వే చేస్తున్నాయి.

ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్‌ల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అని ఖాతాలు తెరిచారు. ప్రత్యేకంగా ఎస్సై స్థాయి అధికారితో ఓ టీంను ఏర్పాటు చేశారు. ఆ టీం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జనాలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తోంది. ఆ పోస్టుల్లో కాసింత హాస్యం, కావాల్సినంత మేసెజ్‌ ఉండడంతో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. బండి నంబర్లు కనిపించకుండా.. బైక్‌పై వెనుకలా కూర్చున్నవాళ్లు పెద్ద స్టంట్లే చేస్తున్నారు. అలాంటి వారికోసం సైబరాబాద్‌ పోలీసులు ఎలాంటి మీమ్స్ చేశారో మీరే చూడండి.

సినిమా, క్రికెట్, బిగ్‌బాస్ వంటి అంశాలతో మీమ్స్ క్రియేట్‌ చేస్తుండడంతో నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. వారికి మంచి క్రేజ్‌ రావడంతో జనాలే వాటిని షేర్ చేస్తూ ప్రమోట్‌ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలసుల కృషితో ప్రమాదాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. వాహనదారులు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తూ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇదంతే మీమ్స్ పుణ్యమే అని పోలీసులు అంటున్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు సైబ‌రాబాద్ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. పోలీసులు పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ జనాలను అలెర్ట్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories