హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం
x
metro rail File Photo
Highlights

దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని...

దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. దిశ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. చట్టల్లో మార్పులు తీసురావాలని, మహిళలపై దాడులు చేసిన మృగాలను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోరైలులో ప్రయాణించేటప్పుడు మహిళలు భద్రతకోసం వారి వెంట పెప్పర్ స్ప్రేలను అనుమతిచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడారు. మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రేలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. మెట్రో భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. దిశ ఘటన నేపథ్యంలో మంగళవారం బెంగళూరు మెట్రోలో పెప్పర్ స్ర్పే అనుమతిస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.‎ తాజా హైదరాబాద్ మెట్రో కూడా పెప్పర్ స్ర్పేలకు అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories