Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..పెరిగిన మెట్రో రైలు ఛార్జీలు
x
Highlights

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే మెట్రో రైలు ఛార్జీలు పెరకబోతున్నాయి. మే రెండో వారం నుంచి సవరించిన ధరలు...

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే మెట్రో రైలు ఛార్జీలు పెరకబోతున్నాయి. మే రెండో వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఎల్ అండ్ టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే ఛార్జీలు ఖరారు కానున్నాయి. వీటి ద్వారా వార్షికంగా అదనంగా రూ. 150కోట్ల వరకు రాబట్టుకొనేలా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది.

ప్రస్తుతం మెట్రోలో కనిష్టం రూ. 10, గరిష్టం రూ. 60 ఉంది. గరిష్టం రూ. 75 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో ఆపరేషన్స్ ప్రకటనలు, మాల్స్ రెంట్స్ ద్వారా ఏటా రూ. 1500కోట్ల వరకు ఆదాయం వస్తోంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీల చెల్లింపు వంటి ఖర్చులన్నీ కలిపి రూ. 2వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని ఎల్ అండ్ టీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories