హైదరాబాద్ లో‌ మెట్రో రైల్ సేవలు ప్రారంభం.. ఈ రూట్ లోనే..

హైదరాబాద్ లో‌ మెట్రో రైల్ సేవలు ప్రారంభం.. ఈ రూట్ లోనే..
x
Highlights

168 రోజుల విరామం అనంతరం దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు ప్రారంభం అయ్యాయి..

168 రోజుల విరామం అనంతరం దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో కూడా ఉదయం 7 గంటల నుంచి మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా భౌతిక దూరాన్ని పాటించడానికి మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు లోపల కూడా గుర్తులను మార్క్‌ చేశారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం అయినా, నేడు కేవలం కారిడార్-1 మియాపూర్ - ఎల్‌బీ నగర్ మార్గంలో మాత్రమే మైట్రో పరుగులు పెడుతోంది. సెప్టెంబర్ 7న కారిడార్-1, 8న కారిడార్-3, సెప్టెంబరు 9నుంచి అన్ని మెట్రో రైళ్ల సేవలు

తిరిగి అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో సంస్థ అధికారులు వెల్లడించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 మధ్య రైళ్లను నడపుతోంది హైదరాబాద్ మెట్రో. కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న మూసాపేట, భరత్‌నగర్‌ తప్ప మిగతావి అందుబాటులో ఉన్నాయి. ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుస్తోంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ తో ఆగిపోయిన మెట్రో సేవలు అప్పటినుంచి నిన్నటివరకూ ప్రారంభం కాలేదు. అయితే భారత ప్రభుత్వం అన్ లాక్ 4 లో భాగంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. అదికూడా కంటైన్మెంట్ జోన్లలో కాకుండా ఇతర ప్రాంతాలలో మాత్రమే అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories