Top
logo

Hyderabad Metro: పరుగులకు సిద్ధం అవుతున్న మెట్రో.. ప్రయాణించాలంటే నిబంధనలు ఇవే!

Hyderabad Metro: పరుగులకు సిద్ధం అవుతున్న మెట్రో.. ప్రయాణించాలంటే నిబంధనలు ఇవే!
X

 హైదరాబాద్ మెట్రో పరుగులు 

Highlights

Hyderabad Metro: మెట్రో హైదరాబాద్ లో పరుగులు తీయడానికి సిద్ధం అవుతోంది. కేంద్రం ప్రభుత్వం అన్ లాక్ ల 4.0 లో భాగంగా మెట్రో రైళ్ళు తిరగడానికి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణా సర్కారు కూడా హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు పునఃప్రారంభం కోసం అనుమతి ఇచ్చారు.

Hyderabad Metro: మెట్రో హైదరాబాద్ లో పరుగులు తీయడానికి సిద్ధం అవుతోంది. కేంద్రం ప్రభుత్వం అన్ లాక్ ల 4.0 లో భాగంగా మెట్రో రైళ్ళు తిరగడానికి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణా సర్కారు కూడా హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు పునఃప్రారంభం కోసం అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో తిరిగి ప్రారంభించడానికి హైదరాబాద్ మెట్రో సంస్థ సిద్ధం అవుతోంది. అయితే, కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు నూరుశాతం పాటిస్తూ మెట్రో సర్వీసులను తిప్పడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయాణీకులకు పలు నిబంధనలు విధించింది హైదరాబాద్ మెట్రో.. మెట్రోలో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవే..

- వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెట్రో రైలులోకి ప్రవేశాన్ని కల్పించడాన్ని తాత్కాలికంగా నిషేధించ బోతున్నారు.

- అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులను పూర్తిగా ఆపేస్తారు.

- టికెట్లను కూడా కౌంటర్ల నుంచి నేరుగా కొనుక్కోవడానికి అవకాశం ఉండదు. కేవలం స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ టికెట్ల ద్వారా మాత్రమె అనుమతిస్తారు.

ఇప్పటివరకూ Hyderabad Metro: హైదరాబాద్ లో 7 నుంచి మెట్రో పరుగులు హైదరాబాద్ మెట్రో చెబుతున్న నిబంధనలు ఇవే. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు వెలువడే అవకాశం ఉంది. కాగా, కరోనా కారణంగా గత మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెల్సిందే. దీంతో చాలాకాలం తరువాత మెట్రో రైళ్ళను తిరిగి ప్రారంభించడం విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇప్పటికే మొత్తం 3 కారిడార్లలోని 57 స్టేషన్లలో క్లీనింగ్ శానిటేషన్ పనులను నిర్వహిస్తున్నారు. దేశంలోనే అతి పొడవైన మెట్రో వ్యవస్థ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ. రోజుకు 4.5 లక్షల ప్రయాణీకులను 55 రైళ్ళ ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది హైదరాబాద్ మెట్రో.

Web TitleHyderabad Metro is making arrangements to restart metro services as per Unlock 4.0 guidelines
Next Story