Hyderabad Metro: ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా పెరగనున్న హైదరాబాద్ మెట్రో ఛార్జీలు?

Hyderabad Metro: ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా పెరగనున్న హైదరాబాద్ మెట్రో ఛార్జీలు?
x
Highlights

Hyderabad Metro: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ షాక్ ఇవ్వనుంది మెట్రో. త్వరలోనే ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017 నవంబర్ నుంచి దశలవారీగా...

Hyderabad Metro: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ షాక్ ఇవ్వనుంది మెట్రో. త్వరలోనే ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017 నవంబర్ నుంచి దశలవారీగా మెట్రోరైలు సేవలు ప్రజలకు అందబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి గత ఆర్థిక ఏడాది ముగిసేవరకు మెట్రో రైలు నష్టాలు రూ. 6,500కోట్లకు చేరుకున్నాయని సంస్థ తెలిపింది. స్టేషన్లు, మాల్స్ లో రిటైల్ స్పేస్ లీజ్, ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకునేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నా నష్టాలు భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపింది.

కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు మెట్రో రైలు ఛార్జీలను సవరించాలని ఎల్ అండ్ టీ మెట్రో 2022లో రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మెట్రోరైల్వే మెయింటనెన్స్ యాక్ట్ ప్రకారం కమిటీ ఏర్పాటు చేసింది. కాగా నష్టాలు ఏటా పెరుగుతుండటం, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44శాతం పెరగడంతో హైదరాబాద్ మెట్రో కూడా ఛార్జీల పెంపునకు రెడీ అయ్యింది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ రూ. 10, గరిష్ట ఛార్జీ రూ. 60 ఉండగా ఎంత పెంచాలని నిర్ణయం తీసుకోనుంది

Show Full Article
Print Article
Next Story
More Stories