Hyderabad: నూతన సంవత్సర వేడుకకు రెడీ అవుతోన్న భాగ్యనగరం

Hyderabad: నూతన సంవత్సర వేడుకకు రెడీ అవుతోన్న భాగ్యనగరం
x

Hyderabad: నూతన సంవత్సర వేడుకకు రెడీ అవుతోన్న భాగ్యనగరం

Highlights

నూతన సంవత్సర వేడుకకు రెడీ అవుతోన్న భాగ్యనగరం మరింత కొత్తగా నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్దం న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఈసారి న్యూ ఇయర్ వేడుకల కోసం ఈవెంట్స్ నిర్వహించే క్లబ్‌లు,..

2025కి గుడ్ బై చెప్పి 2026కి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరం రెడీ అవుతుంది. ఈసారి మరింత కొత్తగా నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధం అవుతున్నారు. ఎట్లాగో పబ్‌లు క్లబ్‌లలో ఈవెంట్స్ ఉండనే ఉంటాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయిలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగర పోలీసులు.

ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకల కోసం ఈవెంట్స్ నిర్వహించే క్లబ్‌లు పబ్‌లు.. 15 రోజుల ముందుగానే ఆన్లైన్ ద్వారా అనుమతి తీసుకోవాలంటున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రూల్స్ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

ఇక ఈవెంట్స్ నిర్వహించే మేనేజర్‌లకి పలు సూచనలు చేశారు. వేడుకలు జరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పార్టీల్లో అశ్లీల నృత్యాలు ఉండొద్దు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలి. రాత్రి ఒకటి తరువాత ఈవెంట్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పార్టీల్లో బాణసంచా నిషేధం.. పబ్‌లు, బార్లలో మైనర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంట్రీ ఉండకూడదు. ఈవెంట్ పేరుతో మత్తు దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే 10వేల జరిమానా, 6 నెలల జైలుశిక్షను విధిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్‌ చేస్తారు. మైనర్లు వెహికల్ నడుపుతూ పట్టుబడినా, ప్రమాదానికి గురైనా.. వాహన ఓనర్‌దే పూర్తి బాధ్యత అన్నారు. ఆ రోజంతా కూడా పోలీసుల పూర్తి నిఘాతో పాటు ప్రత్యేకంగా నగరవ్యాప్తంగా షీటీమ్స్‌ నిఘా ఉంటుంది.

ఇక కొంతమంది ఆకతాయిలు న్యూ ఇయర్ రోజు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి బైకులతో విన్యాసాలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిపై ప్రత్యక నిఘా ఉంటుందన్నారు పోలీసులు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమించితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories