ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన డాక్టర్

ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన డాక్టర్
x
టిక్ టాక్ చేసిన డాక్టర్
Highlights

టిక్..టాక్..అంటే నేటి యువతలో తెలియని వారు లేరు.. ఈ యాప్ ఉండని ఫోన్ లేదు..

టిక్..టాక్..అంటే నేటి యువతలో తెలియని వారు లేరు.. ఈ యాప్ ఉండని ఫోన్ లేదు..యాప్ ద్వారా ఎవరికి వారు సొంతంగా ఓ ఇమెజ్ క్రియేట్ చేసుకుని ఫేమస్ అవుతున్నారు. టిక్ టాక్ వీడియోలంటే కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉంది. టిక్ టాక్ లో సరదా శృతిమించిన ఘటనలు అనేకం జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో టిక్ టాక్ వీడియోలు చేసినట్టు కథనాలు జోరుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ వైద్యుడు పేషంట్ కు శస్త్రచికిత్స చేస్తూ ఇతర సిబ్బందితో టిక్ టాక్ చేయడం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్ర్రభుత్వాసుపత్రి డాక్టర్ శ్రీకాంత్ రోగికి ఆపరేషన్ చేస్తూ తన బృందంతో టికి టాక్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు టికా టాక్ ఎవరు చేఎశారు తమకు తెలియదని.. కనీసం తమకు టిక్ టాక్ ఐడీ కూడా లేదని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories