భార్య విడిచి వెళ్లిపోయిందని ఆత‌్మహత్య చేసుకున్న భర్త

Husband Committed Suicide Because His Wife Had Left Him
x

భార్య విడిచి వెళ్లిపోయిందని ఆత‌్మహత్య చేసుకున్న భర్త

Highlights

Rangareddy: భార్యపై కేసు పెట్టవద్దని పోలీసులను కోరిన రాజు

Rangareddy: భార్య విడిచి వెళ్లిపోయిందని అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కొండన్నగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కొండన్నగూడకు చెందిన రాజుకు మూడేళ్ల క్రితం శ్వేతతో వివాహం అయింది. రాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రాజు భార్య శ్వేత మూడు రోజుల క్రితం చెప్పపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాజు. తన భార్య ఇక రాదని భావించిన రాజు అన్నంలో పురుగుల మందు కలుపుని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందుకు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని... తాను చనిపోయిన తర్వాత భార్యపై కేసు పెట్టవదని పోలీసులను వేడుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories