రెండోరోజు కొనసాగుతున్న షర్మిల ఆమరణ నిరాహార దీక్ష

* పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్

R Tripura Malini
Published on: 10 Dec 2022 9:21 AM IST
Hunger Strike By YS Sharmila Continues For The Second day
X

రెండోరోజు కొనసాగుతున్న షర్మిల ఆమరణ నిరాహార దీక్ష

YS Sharmila: వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్ పాండ్ వద్ద పోలీసుల నిర్భంధం కొనసాగుతోంది. లోటస్ పాండ్‌లోని వైఎస్‌ఆర్ టీపీ ఆఫీస్‌ను పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. పార్టీ కార్యకర్తలను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీ నాయకుల అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

నిన్నటి నుంచి 40 మంది పార్టీ ముఖ్య నేతలు బొల్లారం పీఎస్‌లోనే ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురు పార్టీ నేతలు ఉన్నారు. అన్న పానీయాలు సైతం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలోకి రానివ్వడం లేదు. లోటస్ పాండ్ చుట్టూ ఖర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు షర్మిల.

R Tripura Malini

R Tripura Malini

Next Story