యాదాద్రి జిల్లాలో అడవి జంతువుల హల్చల్

Hulchul of Forest Animals in Yadadri District
x

యాదాద్రి జిల్లాలో అడవి జంతువుల హల్చల్

Highlights

Yadadri: లేగ దూడలపై దాడి చేసిన అడవి జంతువులు

Yadadri: అడవులు విస్తీర్ణం నానాటికి తగ్గిపోతుండడంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. పశువులు, పెంపుడు జంతువులు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. దీంతో సమీపంలోని గ్రామస్తులు హడలిపోతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే అడవి జంతువులు ఎక్కడ తమపై దాడి చేస్తాయోన్నన భయం వారిని వెంటాడుతోంది.

రాచకొండ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అడవి జంతువులు నివసిస్తున్నాయి. ఇటీవల అటవీప్రాంతం తగ్గిపోయి తిండిలేక సమీప గ్రామాల్లోని పశువులను వేటాడుతున్నాయి. ఇక కంటికి కనిపించకుండా తిరుగుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం బట్టోనిబావి గ్రామంలో అడవి జంతువులు హల్చల్ చేశాయి. లేగదూడలపై దాడులకు తెగబడ్డాయి. స్థానికుల ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. అటవీశాఖ అధికారులు అడవి మృగాల పాదాల గుర్తులను సేకరించారు.

అయితే ఆ పాదాలు చిరుతవి కాదని హైనావి అని తేల్చేసారు అటవీశాఖ అధికారులు. ఇక ఈ ప్రాంతంలో చిరుతల సంచారం లేదంటున్నారు. అటవీ అధికారులు మాత్రం ఒక జత హైనాలే ఇక్కడికి వచ్చి దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. జంతువులు సంచారం ఉండడంతో వాటిని గుర్తించేందుకు కెమెరాలు ఫిక్స్ చేస్తామంటున్నారు. లేగ దూడలపై దాడి చేసింది మాత్రం కచ్చితంగా చిరుత కాదని ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావలసిన అవసరం లేదంటున్నారు.

గతంలో ఇదే ప్రాంతంలో చిరుతలు సంచరించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలన్నా పొలాలకు వెళ్లాలన్నా హడలిపోతున్నారు. తక్షణం అటవీశాఖ అధికారులు అడవి మృగాల జాడ తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories