దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్: హోమ్ మంత్రి మహమూద్ అలీ

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్: హోమ్ మంత్రి మహమూద్ అలీ
x
Highlights

దేశంలో ఉన్న పోలీసులలో తెలంగాణ రాష్ట్ర పోలీసులే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలంగాణ హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం రోజున శిక్షణ పూర్తి...

దేశంలో ఉన్న పోలీసులలో తెలంగాణ రాష్ట్ర పోలీసులే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలంగాణ హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం రోజున శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని, రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించే దిశగా, అలాగే ప్రజలను సంరక్షించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఇటీవలె రాష్ట్ర ప్రజలకు దడపుట్టించిన కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పోలీసులు ప్రజల కోసం అంకింత భావంతో పనిచేసారని తెలిపారు. వారి వారి కుటుంబాలను కూడా వదిలి సమాజాన్ని కాపాండేందుకు పోలీసులు ముందుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.

అనంతరం కానిస్టేబుల్ శిక్షణ పూర్తిచేసుకున్న 450 మంది యువ కానిస్టేబుళ్లకు మంత్రి మహమూద్ అలీ అభినందనలు తెలిపారు. చక్కగా విధులు నిర్వర్తించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పోలీస్ వ్యవస్థ ఉండి ప్రజలకు నిత్యం సేవచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories