School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ రోజు స్కూళ్లకు సెలవు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Holiday for schools in Telangana on February 14th
x

School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..ఆ రోజు స్కూళ్లకు సెలవు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Highlights

School Holiday: విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలకు, కాలేజీలకు మరో సెలవు రోజు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ...

School Holiday: విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలకు, కాలేజీలకు మరో సెలవు రోజు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అసలు ప్రభుత్వం ఏ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించిందో తెలుసుకుందాం.

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న షబ్ ఎ బరాత్ సందర్బంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు సాధారణ సెలవుగా కాకుండా ఐచ్చిక సెలవుల క్రింద పాఠశాలలకు, కాలేజీలకు సెలవు కింద మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం..ఈ రోజున షబ్ ఎ బరాత్ నిర్వహిస్తారు. ఇది ముస్లింలందరికీ ఒక పవిత్రమైన రోజు. ఈ పర్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. షబ్ ఎ బరాత్ రోు రాత్రంతా మసీదుల్లో దీపాలు అలంకరిస్తారు. ఈ రోజున మసీదుల్లో ముస్లింల కథలు వివరించి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఎంతో విశేషమైన ఈ రాత్రిని కొంతమంది ఉపవాసంగా గడుపుతారు. వారు వారి కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి క్షమాపణలు కోరుతుంటారు.

ఫిబ్రవరి 14న సాధారణ సెలవు కాకపోయినా రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు ఈరోజు మూసి ఉంటాయి. ముఖ్యంగా మైనార్టీ విద్యాసంస్థలు ఈ రోజు సెలవు పాటిస్తాయి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ లో శాబాన్ నెల 15వ తేదీన జరుపుకుంటారు. నెలవంక కనిపించడంతో ఈ రోజును ముస్లిం పెద్దలు షబ్ ఎ బరాత్ గా ఖరారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం సెలవుపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోతే పాఠశాలలు యథావిధిగా తెరుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories