రాజేశ్వరిలో స్పూర్తి నింపిన సుద్దాల అశోక్ తేజ మాటలు

రాజేశ్వరిలో స్పూర్తి నింపిన సుద్దాల అశోక్ తేజ మాటలు
x
Highlights

చేతులు సహకరించకపోయినా కాళ్లతోనే కవితలు వ్రాస్తుంది. పలు సంస్థల నుండి ఎన్నో పురస్కారాలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె ప్రతిభను గుర్తించింది.

చేతులు సహకరించకపోయినా కాళ్లతోనే కవితలు వ్రాస్తుంది. పలు సంస్థల నుండి ఎన్నో పురస్కారాలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె ప్రతిభను గుర్తించింది. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని 12వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది. దివ్యాంగురాలైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్న బూర రాజేశ్వరిపై hmtv ప్రత్యేక కథనం.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రాజేశ్వరి అంగవైకల్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య అభ్యసించలేకపోయింది. ప్రముఖ కవి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాటలు ఆమెలో స్పూర్తిని నింపాయి. ఓ రోజు టీవీ ప్రోగ్రాంలో అశోక్‌తేజ మాటలు విన్న రాజేశ్వరి కాళ్ళతోనే కవితలు వ్రాయడం ప్రారంభించింది.

నేత కార్మికులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం, జీవితం తదితర సామాజిక అంశాలపై కవితలు రాసింది. సాహిత్యానికి అంగవైకల్యం అడ్డురాదని నిరూపించింది. ఈ విషయం తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ స్వయంగా సిరిసిల్లకు వచ్చి ఆమెను అభినందించారు.అంతే కాకుండా ఆమె కవితలకు పుస్తక రూపం ఇచ్చారు. మెకు సిరిసిల్ల రాజేశ్వరి అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఆమె ప్రభుత్వ, పలు స్వచ్చంద సంస్థల నుండి ఎన్నో పురస్కారాలను అందుకుంది. తాజాగా, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి 12వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆమె చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చింది.

శరీరం సహకరించక పోయినా, కవితలు రాస్తూ పేరు తెచ్చుకోవడంపై కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు గుర్తింపు తీసుకువచ్చిన సుద్దాల అశోక్ తేజకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆమెకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులతో వచ్చే మిత్తి ఆరోగ్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదని కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెకు ఉండడానికి ఓ ఇంటిని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు పొందిన సిరిసిల్ల రాజేశ్వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాయం చేయాలని మనమూ కోరుకుందాం.Show Full Article
Print Article
Next Story
More Stories