ఆ కోటి ఎవరిది..?

ఆ కోటి ఎవరిది..?
x
Highlights

తెలంగాణలో నోట్ల కట్టల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయి బీజేపీ అసత్యప్రచారం చేస్తోందంటూ టీఆర్‌ఎస్‌.. పోలీసులు టీఆర్ఎస్‌ నేతలకు సహకరిస్తున్నారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి

తెలంగాణలో నోట్ల కట్టల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయి బీజేపీ అసత్యప్రచారం చేస్తోందంటూ టీఆర్‌ఎస్‌.. పోలీసులు టీఆర్ఎస్‌ నేతలకు సహకరిస్తున్నారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తెలంగాణలో నోట్లకట్టల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ వేళ.. దొరికిన ఆకోటి రూపాయలు బీజేపీ అభ్యర్థి రఘునంద్‌న్‌రావుకి చెందినవి పోలీసులు ప్రకటించారు. అయితే ఆ డబ్బు రఘునందన్‌రావు బావమరిది దగ్గరే పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇక కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.

పోలీసుల ప్రకటనతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే బీజేపీ డబ్బును తరలిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ నేతలపై ఎదురుదాడికి దిగారు. పోలీసులు లీగల్‌ మనీని హవాలాగా చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కోటి రూపాయలు తన బావమరిదివేనన్న రఘునందన్‌ రావు.. సురభి శ్రీనివాసరావు వ్యాపార విషయంలో తనను ఎందుకు లాగుతున్నారని ఫైరయ్యారు.

మరోవైపు బీజేపీ తీరును నిరసిస్తూ డీజీపీని కలిశారు టీఆర్ఎస్‌ నేతలు. హైదరాబాద్‌లో బీజేపీ విధ్వంసానికి పాల్పడుతుందంటూ ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు పోలీసులు టీఆర్ఎస్‌ నేతలకు సహకరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మొత్తానికి పట్టుబడ్డ నగదు రఘునందన్‌రావుదా..? లేక ఆయన బావమరిదిదా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దుబ్బాక పాలిటిక్స్‌లో కోటి రూపాయల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories