అమ్మ చెంతకు చిన్నారులు

అమ్మ చెంతకు చిన్నారులు
x
Highlights

హెచ్ఎంటీవీ మరోసారి మానవత్వంతో స్పందించింది. అసలే ఆడపిల్లలు... లోకం తీరే తెలియని చిన్నారులను బాధను అధికారులను స్పందించేలా చేసింది. పట్టుమని పదేళ్లు...

హెచ్ఎంటీవీ మరోసారి మానవత్వంతో స్పందించింది. అసలే ఆడపిల్లలు... లోకం తీరే తెలియని చిన్నారులను బాధను అధికారులను స్పందించేలా చేసింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని బాలికలు నరకం అనుభవిస్తున్న తీరును లోకానికి చూపించింది. మొన్నటి వరకు అల్లారుముద్దుగా చూసుకున్న తల్లిదండ్రుల జాడ తెలియక తల్లడిల్లిపోతున్న వైనాన్ని కళ్లకు కట్టింది. కంటికి రెప్పలా కాపాడిన కన్నవారు కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారులు కన్నవారిని కలిసేలా తన వంతు ప్రయత్నం చేసింది.

పది రోజుల క్రితం ములకలపల్లి మండలం గుండాలపాడు చలమన్న గ్రామంలో అటవీ అధికారులు.. పోడు సాగుదారుల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు 11మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసి ఖమ్మం జిల్లా జైలుకు రిమాండ్ చేశారు. ఇందులో గ్రామానికి చెందిన ఆదివాసీ దంపతులు కూడా ఉన్నారు తమ తల్లిదండ్రులు జైలుకు వెళ్లిన విషయం తెలియని వారి చిన్నారులు పది రోజులుగా పడుతున్న వేదన అందరిని ఆవేదనకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లా జైలు ముందు వారు తమ అమ్మానాన్నలను కలిపించాలని కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసేవాళ్ల హృదయాలను కదిలిస్తోంది

తల్లిదండ్రులు జైలుకు వెళ్లారని కూడా తెలియని చిన్నారులు.. ఏమైయరో తెలియని పిల్లలు కన్నవారి కోసం పడిగాపులు కాస్తున్న విషయాన్ని హెచ్ఎంటీవీ కళ్లకు కట్టింది. కన్నవారు కారాగారంలో ఉన్నారని తెలుసుకున్న చిన్నారులు రెండ్రోజులుగా జైలు ముందు నిలబడి ఎదురు చూస్తున్న పరిస్థితిని సమాజానికి చూపించింది. జైలు అధికారులు స్పందించేలా హెచ్‌ఎంటీవీలో వరస కథనాలు ప్రసారమయ్యాయి. కన్నవారి కోసం పిల్లలు పడుతున్న ఆవేదనను హెచ్‌ఎంటీవీ ద్వారా తెలుసుకున్న పోలీసులు... చిన్నారులకు తల్లిదండ్రులను చూపించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories