మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ గిఫ్ట్‌ కార్యక్రమానికి శ్రీకారం

hmtv and JCI Hyderabad SUPAR Launches Gift Program on the Occasion of Womens Day
x

మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ గిఫ్ట్‌ కార్యక్రమానికి శ్రీకారం

Highlights

Gift Campaign: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హెచ్‌ఎంటీవీ.

Gift Campaign: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హెచ్‌ఎంటీవీ. ఆడపిల్ల అంటే భారం కాదని.. కుటుంబానికి గొప్ప నిధి అంటూ సమాజంలో మహిళల ప్రాధాన్యత తెలియజేస్తూ హెచ్‌ఎంటీవీ గిఫ్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఐదు ప్రధాన మెటర్నిటీ హాస్పిటల్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా జేసీఐ హైదరాబాద్‌ సూపర్‌, హెచ్‌ఎంటీవీ సంయుక్తంగా ఉమెన్స్ డే రోజు జన్మించిన ఆడపిల్లల తల్లులకి సిల్వర్ కాయిన్‌తో పాటు ఆడుకోవటానికి టాయ్ గిఫ్ట్‌లను అందజేశారు.

హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ గిఫ్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఈవో లక్ష్మీరావు. ఛానల్ మహిళా సిబ్బందితో పాటు జేసీఐ, ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమి, లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి పింక్ బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడపిల్ల కుటుంబానికి గొప్ప ఐశ్వర్యం అని... భారం ఎప్పటికీ కాదని మహిళా అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉందని hmtv సీఈఓ లక్ష్మీ రావు ఆకాక్షించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంటీవీ చేపట్టిన గిఫ్ట్‌ కార్యక్రమాన్ని మొదట నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ సీఈఓ లక్ష్మీ రావు, ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్‌ కృష్ణ ప్రదీప్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వినోద్, హాస్పిటల్ ఆర్ఎంఓ పాల్గొన్నారు. ఆడపిల్లలకి జన్మనిచ్చిన మహిళలకు బహుమతులు ఇచ్చారు. 25 మంది తల్లులకు లయన్స్ క్లబ్ సహకారంతో సిల్వర్ కాయిన్‌లను అందజేశారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ వారు hmtv కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఇక పేట్ల బుర్జు ఆసుపత్రిలో నిర్వహించిన గిఫ్ట్స్‌ కార్యక్రమంలో జేసీఐ హైదరాబాద్ సూపర్ టీంతో పాటు హాస్పిటల్ ఆర్ఎంఓ పాల్గొన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు సిల్వర్ కాయిన్, టాయ్ గిఫ్ట్ బాక్స్ అందజేశారు. 30 మంది చిన్నారులకి ఈ గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. ఆ తర్వాత కింగ్ కోఠి హాస్పిటల్‌లో నిర్వహించిన హెచ్‌ఎంటీవీ గిఫ్ట్‌ కార్యక్రమంలో హాస్పిటల్‌ సూపరింటెండెంట్ రాజేందర్‌తో పాటు జేసీఐ హైదరాబాద్ సూపర్ టీం పాల్గొని కాయిన్స్ అందించారు. కింగ్‌ కోఠి హాస్పిటల్‌లో కూడా 30 మందికి గిఫ్ట్స్ అందించారు.

ఆ తర్వాత కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో.. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, జేసీఐ హైదరాబాద్ సూపర్ టీం పాల్గొని గిఫ్ట్‌లు అందించారు. 40 మంది మహిళలకు ఈ గిఫ్ట్ బాక్స్ అందజేయగా.. గిఫ్ట్ కార్యక్రమాన్ని నిర్వహించిన HMTVకి అభినందనలు తెలిపారు హాస్పిటల్ సిబ్బంది. గాంధీలో నిర్వహించిన హెచ్‌ఎంటీవీ గిఫ్ట్ కార్యక్రమాంలో హాస్పిటల్ ఆర్ఎంఓతో పాటు జేసీఐ హైదరాబాద్ సూపర్ టీం పాల్గొన్నారు. 35 మంది మహిళలకి గిఫ్ట్స్ అందించారు.

హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో గిఫ్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు jci హైదరాబాద్ సూపర్ టీం సభ్యులు. గిఫ్ట్ తీసుకున్న తల్లుల ముఖాల్లో చిరునవ్వు.. వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవటానికి కృషి చేసిన హెచ్ఎంటీవీ సీఈఓ లక్ష్మి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రాధాన్యతను తెలియజెబుతూ హెచ్‌ఎంటీవీ నిర్వహించిన గిఫ్ట్‌ కార్యక్రమానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories