Hyderabad: హైద‌రాబాద్‌లో అత్యాధునిక స్కిన్ హాస్పిట‌ల్ ప్రారంభం.. త‌ర‌లివ‌చ్చిన సినిమా లోకం

HK Hospitals Launch in Hyderabad: Star-Studded Opening for Advanced Aesthetic & Skin Care Facility
x

Hyderabad: హైద‌రాబాద్‌లో అత్యాధునిక స్కిన్ హాస్పిట‌ల్ ప్రారంభం.. త‌ర‌లివ‌చ్చిన సినిమా లోకం

Highlights

Hyderabad: గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్‌లో హెచ్‌కే హాస్పిటల్స్‌ కొత్త శాఖ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

Hyderabad: గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్‌లో హెచ్‌కే హాస్పిటల్స్‌ కొత్త శాఖ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్లాస్టిక్, కాస్మెటిక్, ఎస్తటిక్ సర్జరీలలో ఈ ఆసుప‌త్రికి ప్రావీణ్యం ఉంది. ఈ ప్రారంభ వేడుకకు సినీ ప్రముఖులు, బిగ్‌బాస్ తారలు హాజరై వేడుకకు మ‌రింత అట్రాక్ష‌న్ తీసుకొచ్చారు.

ఈ వేడుకలో సంగీత దర్శకుడు మణిశర్మ, కమెడియన్ అలీ, నటి అనసూయ, హీరో సంతోష్ శోభన్, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, దీప్తి సునైనా, అలేఖ్య హారిక, గీతూ, సీత, కీర్తి భట్, సిరి శ్రీహాన్, నిఖిల్ విజయేంద్ర సింహా, శివజ్యోతి గంగూలీ, సంపూర్ణేష్ బాబు, జస్వంత్ జెస్సీ, శ్రావంతి చోకారపు తదితరులు పాల్గొన్నారు. వారు హాస్పిటల్ టీమ్‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హెచ్‌కే హాస్పిటల్స్ వ్యవస్థాపకులు హర్షిత, కార్తిక్ మాట్లాడుతూ.. “మేము అత్యాధునిక సాంకేతికతను, నిపుణుల అనుభవాన్ని కలిపి, రోగులకు విలాసవంతమైన అనుభూతిని కలిగించే పేషెంట్-సెంట్రిక్ వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం" అని తెలిపారు.

హెచ్‌కే హాస్పిటల్స్‌లో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ గైనకాలజీ, కాస్మెటిక్ డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, పర్మనెంట్ మేకప్, జనరల్ గైనకాలజీ వంటి సేవలను అందిస్తారు. అధునాతన విధానాల్లో విశ్వసనీయతతో, నిపుణుల చేతుల మీదుగా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు చెబుతున్నారు. హైఎండ్ టెక్నాలజీ, ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్‌ ద్వారా పేషెంట్లకు బెస్ట్ కేర్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories