సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్లు

సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్లు
x
సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్లు
Highlights

మేడారంలో సమ్మక్క -సారలమ్మ జాతర వైభవంగా సాగుతోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క దిగి వచ్చి గద్దెపై ఆసీనురాలైంది. ఈ ఘట్టం ఎంతో అద్భుతంగా సాగింది. సమ్మక్క...

మేడారంలో సమ్మక్క -సారలమ్మ జాతర వైభవంగా సాగుతోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క దిగి వచ్చి గద్దెపై ఆసీనురాలైంది. ఈ ఘట్టం ఎంతో అద్భుతంగా సాగింది. సమ్మక్క రాకను స్వాగతిస్తూ ఎస్పీ సంగ్రామ్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మేడారంలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి వెళ్లి గద్దెపై ఉన్న సమక్కను దర్శించుకున్నారు.

తెలంగాణ మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల గవర్నర్‌లను సాధరంగా స్వాగతం పలికి, దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సమ్మెక్కకు చీరెను సారిగా పెట్టి, బంగారాన్ని(బెళ్లం)ను ప్రసాదంగా నివేదించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories