TS High Court: డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్..

High Court Serious GHMC Deccan kitchen Hotel Demolished
x

TS High Court: డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్.. 

Highlights

TS High Court: హైకోర్టుకి హాజరు కాని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు

TS High Court: జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై జీహెచ్‌ఎంసీ అధికారులపై ధర్మాసనం ఆగ్రహ‍ం వ్యక్తం చేసింది.. జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు హైకోర్టుకి హాజరు కాకపోవడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్ట్ స్టే ఆర్డర్ ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం అయినా.. అర్జంట్‌గా కూల్చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆదివారం, సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు పట్టించుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రతివాదులందరూ కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సిందేనని, జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ సహా.. ప్రతివాదులందరూ గురువారం హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర‌్భంలోనే డిమాలిష్ ఆర్డర్స్ ఎక్కడున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేత జరిగే ముందు డిమోలిష్ ఆర్డర్స్ బాధితులకు ఇచ్చారా అని, కూల్చివేత సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారని ప్రశ్నించింది.. GHMC మాజీ కమిషనర్ లోకేష్ కుమార్, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ తప్పకుండా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశిస్తూ... తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories