High Court: డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై నివేదిక కోరిన హైకోర్టు

High Court Seeks Report On Double Bedroom Houses
x

High Court: డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై నివేదిక కోరిన హైకోర్టు

Highlights

High Court: నవంబరులోపు దశలవారీగా కేటాయిస్తామని హైకోర్టుకు నివేదిక

High Court: హైదరాబాద్ పరిసరాల్లోనూ, తెలంగాణవ్యాప్తంగా పూర్తియిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుపై అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. ఇండ్లు పూర్తయినా.. కేటాయింపులో జాప్యం జరుగుతోందని బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి 2021లో ప్రజావ్యాజ్యం వేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరింది.

తెలంగాణ వ్యాప్తంగా ఒక లక్షా, 43 వేల 544 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వీటిలో 65వేల 538 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించామని హైకోర్టుకు నివేదిక సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో పూర్తయిన ఇండ్లలో మొదటి దశలో 4074 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించామని, మిగిలిన 65 వేల 458 ఇండ్లను దశలవారీగా కేటాయిస్తామని కోర్టుకు నివేదించారు. సెప్బెంబరు మొదటి వారంలో 12 వేల 275 ఇండ్లను కేటాయించబోతున్నామని కోర్టుకు వివరించారు. నవంబరు మొదటి వారానికి పూర్తయిన ఇండ్లన్నీ లబ్ధిదారులకు కేటాయిస్తామని ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు.

నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై నివేదిక రూపకల్పనకోసం మరికొంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై తదుపరి విచారణ మూడు వారాలు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories