పార్టీ మారిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

పార్టీ మారిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో విలీనం అయినట్టు శాసనమండలి...

తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో విలీనం అయినట్టు శాసనమండలి ఛైర్మెన్ కు లేఖ కూడా ఇచ్చారు. అయితే ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. శాసనమండలి విడుదల చేసిన బులిటెన్ నంబర్-9 రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు అసెంబ్లీ లా సెక్రటరీ,మండలి ఛైర్మన్, తెలంగాణ సీఎస్‌తోపాటు ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్,దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత… సంతోష్‌రెడ్డికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories