ఆర్టీసీ ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి.. తప్పుడు లెక్కలు సమర్పించారని ఆగ్రహం

ఆర్టీసీ ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి.. తప్పుడు లెక్కలు సమర్పించారని ఆగ్రహం
x
Highlights

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ తరుపున హైకోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానానికి అడిషనల్ అఫిడవిట్...

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ తరుపున హైకోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానానికి అడిషనల్ అఫిడవిట్ ఆర్టీసీ దాఖలు చేసింది. ఆర్టీసీలో నిర్వహణ వ్యయం, డీజిల్ భారం ఎక్కువగా ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వ సాయం అందుతున్న నష్టాలు తప్పడంలేదని క్టోరుకు తెలిపింది.

ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు కోర్టులో ఉండి కూడా వాస్తవాలు చెప్పడంలేదని అసహనం వ్యక్తం చేసిన కోర్టు నిజాలు చెప్పాలని చురకలంటించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా నివేదికలో ఏ విధంగా పేర్కొంటారంటూ హైకోర్టు ప్రశ్నించింది. రాయితీ బకాయిలను డీజిల్, జీతాల చెల్లింపు, ఇతర అవసరాలకు ఖర్చు చేసినట్లు ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసికి జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు 2015-16, 2016-17లో కలిపి 336 కోట్లు ఎందుకు చెల్లించారని కోర్టు ప్రశ్నించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories