logo
తెలంగాణ

Mulugu: ములుగు జిల్లాలో హై అలర్ట్

High Alert in Mulugu District for Upcoming Martyrs Week
X

ములుగు జిల్లాలో హై అలెర్ట్ 

Highlights

Mulugu: ఆగస్టు 3వరకు అమరవీరుల వారోత్సవాలు * అప్రమత్తమైన పోలీసు బలగాలు

Mulugu: ములుగు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 3వరకు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో అప్రమత్తమైన పోలీస్ బలగాలు మావోల కోసం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి దాటి ఏజెన్సీ అడవుల్లోకి ప్రవేశించే ఛాన్స్‌ ఉండటంతో గోదావరి ఫెర్రీ పాయింట్లు, ముళ్లకట్ట, పూసూరు బ్రిడ్జిల దగ్గర గస్తీ కాస్తున్నారు భద్రతా దళాలు. మరోపక్క ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్‌ మండలాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. మావోలకు సహకరిస్తున్నారనే సమాచారంతో గొత్తికోయలపై కూడా నిఘా ఉంచారు పోలీసులు. పలు మండలాల్లో పోలీస్‌ కవాతు నిర్వహిస్తున్నారు.


Web TitleHigh Alert in Mulugu District for Upcoming Martyrs Week
Next Story