ఏటూరునాగారం సబ్ డివిజన్ లో హై అలెర్ట్

ఏటూరునాగారం సబ్ డివిజన్ లో హై అలెర్ట్
x
ఏటూరునాగారం సబ్ డివిజన్ లో హై అలెర్ట్
Highlights

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో హై అలెర్ట్ నెలకొంది.

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో నేటి నుంచి 8 వరకు పీఎల్జీఏ 19 వ వార్షికోత్సవాలు జరుగనుండడంతో హై అలెర్ట్ నెలకొంది. ఒక వైపు వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు, మరోవైపు వాటిని విఫలం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కోసం అడవులను జల్లెడపడుతున్నారు.

ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేయడంతో పాటు, మావోలకు సహకరిస్తున్నారనే అనుమానంతో ప్రతీరోజూ పోలీసులు గొత్తికోయ గుంపుల్లో కార్డెన్ సెర్చులు నిర్వహిస్తున్నారు. అంతేగాక గొత్తికోయల దినచర్య, వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అలాగే ఆయా మండలాల్లోని మావోలకు సంబంధించిన మాజీలు, మిలిటెంట్లకు పోలీసు స్టేషన్లకు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

పోలీసుల హెచ్చరికలతో అధికార పార్టీ నాయకులు, టార్గెట్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఏటూరునాగారం కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే దారి పై, కన్నాయిగూడెం మండలంలోని బుట్టయిగూడెం, పలిమేల వంటి ప్రాంతాల్లో మావోల పేర కరపత్రాలు వెలిసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, మావోయిస్టుల వల్ల ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories