Andhra Pradesh: విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు

Andhra Pradesh: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా: చిరంజీవి

Sandeep Eggoju
Updated on: 10 March 2021 9:31 PM IST
Hero Chiranjeev Support To Visakha Steel Plant Protest
X
చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇక.. రోజు రోజుకూ మద్దతు కూడగట్టుకుంటోంది ఈ ఉక్కు ఉద్యమం. కార్మికులు, కార్మిక సంఘాలతో పాటు, రాజకీయ పార్టీలు తెలుపుతున్న నిరసనకు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించారు. అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. తాజాగా.. ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ప్రకటించారు.

కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉద్యమంలో తాను పాల్గొన్నానని, అప్పట్లోనే విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని బ్రష్‌తో రాసినట్టు ఆయన చెప్పారు. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేస్తామనడం దారుణమన్న చిరు స్టీల్‌ ప్లాంట్‌ నిర్ణయంపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని కోరారు. అలాగే.. ప్రాంతాలు, పార్టీలకతీతంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మెగాస్టార్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story