Helicopter Crash: నల్గొండ జిల్లాలో హెలికాప్టర్ క్రాష్

Helicopter Crash in Nalgonda District
x

నల్గొండ జిల్లాలో హెలికాప్టర్ క్రాష్

Highlights

Helicopter Crash: పైలట్, ట్రైనీ పైలట్ మృతి

Helicopter Crash: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. శిక్షణ హెలికాప్టర్ కూలిన విషయాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories