Panthangi Toll Plaza: పల్లెబాట పట్టిన పట్నం.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

Heavy Traffic At Panthangi Toll Plaza
x

Panthangi Toll Plaza: పల్లెబాట పట్టిన పట్నం.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

Highlights

Panthangi Toll Plaza: టోల్‌గేట్ దగ్గర భారీగా బారులు తీరిన వాహనాలు

Panthangi Toll Plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం 65వ నెంబర్ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల సందడి నెలకొంది. భోగి పండుగ కావడం, నేటి నుండి ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలకు సెలవు కావడంతో ప్రజలు పండుగకు పట్నం వదిలి పల్లెబాట పట్టారు. ప్రజలు సొంత వాహనాల్లో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. సంక్రాంతి పండుగ వాహనదారులతో జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పండగకు వెళ్తున్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలతో రద్దీగా మారింది. టోల్‌గేట్ వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories