Vikarabad: వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

వానల ధాటికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పలుచోట్ల నీటమునిగిన పంటలు, రైతన్నలకు తీవ్రనష్టం పలుచోట్ల రాకపోకలకు అంతరాయం

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2025 4:30 PM IST
Vikarabad: వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
X

Vikarabad: వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వానల ధాటికి పంటలు నీట మునిగాయి. వాగులు, పొంగిపొర్లడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జైదుపల్లి రైల్వే వంతెన కింద చించల్ పేట, అక్నాపూర్ గ్రామాల మధ్య గొట్టిముక్కల వాగు, మైలారం- నాగారం మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story