ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు
x
Highlights

ఎండకు ఎండిపోయిన పైర్లు.. కళ్ల ముందే పంట నాశనం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.. నిన్నటి వరకూ వరంగల్ రైతన్నల పరిస్థితి ఇది.. తాజాగా కురిన వర్షాలతో...

ఎండకు ఎండిపోయిన పైర్లు.. కళ్ల ముందే పంట నాశనం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.. నిన్నటి వరకూ వరంగల్ రైతన్నల పరిస్థితి ఇది.. తాజాగా కురిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.. ఖరీప్ పంటలకు ఇక డోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని రైతుల్లో ఖరీప్ ఆశలు చిగురించాయి. ఖరీఫ్ ప్రారంభమైన ఇన్నిరోజులకు చెప్పకోదగ్గ వర్షం కురవడంతో.. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్మయ్యారు.. కారుమ బ్బులు కమ్ముకుని వస్తూ చినుకులు రాలు తుండటంతో రైతుల్లో అనంధం విల్లవిరుస్తుంది. పోలాల్లో రైతులు వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.

ములుగు జిల్లాలో చిరుజల్లులతో వాతవరణం చల్ల బడింది. భారీ వర్షానికి వాజేడు మండలం లోని చికుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బోగత జలపాతానికి భారీ స్థాయిలో నీరువచ్చి చేరు తుండటంతో జలకళ సంతరించుకుంది. ఛత్తీస్‌ఘడ్ లో భారీగా వర్షాలు పడుతుండంతో బొగత జలపాతానికి అధిక నీరు చేరుతోంది.. ఇక బొగత జలపాతం పొంగి, పొర్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం కురుస్తుండటంతో రైతుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. చిట్యాల, రేగొండ మండలాల్లో భారీ వర్షం కురిసింది.. గత పదిహేను రోజులుగా జిల్లాలో వర్షం లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. అయితే తాజాగా కురిసిన వర్షం వరిలో కొత్త ఆశలను చిగురింప చేసింది.

వర్షంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ,జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ ,జనగామ ములుగు జిల్లాలో మొక్క జొన్న పంటలు చేతికి అందుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటలకు తోడుగా మిర్చి సాగు చేసేందుకు నారు పోసారు. అ పంటలు పచ్చగా చిగురిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. మొత్తానికి ఎట్టకేలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్టకేలకు కురిసిన భారీ వర్షంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.. ఖరీప్‌కు ఇక నీటి కష్టాలు లేవంటున్నారు రైతలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories