Heavy rains in Telangana: రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు.. హైదరబాద్ లో కుంభవృష్టి!

Heavy rains in Telangana: రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు.. హైదరబాద్ లో కుంభవృష్టి!
x

Heavy Rains in telangana 

Highlights

Heavy rains in Telangana | గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయాయి.

Heavy rains in Telangana | గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయాయి. దీంతో నగర ప్రజలంతా కొద్ది రోజుల నుంచి ఉక్క‌పోత‌కు గురయై అతలాకుతలం అవుతున్నారు. అయితే, హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం వరకు వేడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి చల్లబడిపోయింది. ఆక‌స్మికంగా వాతావ‌ర‌ణంలో మార్పులు వచ్చి వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి బుధవారం పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసాయి..

నగరంలో భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, కోఠి, దిల్‌సుక్‌నగర్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నాంపల్లి, అబిడ్స్‌, బేగంపేట్‌, ఖైరతాబాద్‌, పాతబస్తీ, రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలక్‌నుమా, షేక్‌పేట్‌ లో అత్యధికంగా 10.9 సెంటిమేటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్తాపూర్‌ లో10.5, ఫిలింనగర్ లో9.7, దూద్ బౌలిలో 8.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్ 8.7‌, శ్రీనగర్ కాలనీలో 8.2, మెహదీపట్నం, గచ్చిబౌలిలో 8 సెంటిమీటర్లు, జియగూడలో 7.9, బంజారాహిల్స్ 7.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షకు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరులో 23.3, తెల్కపల్లెలో 21.2, పెద్దమద్నూరు, నాగర్‌కర్నూల్‌లో 20.2, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 18.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవన్నీ గత పదేళ్లలో సెప్టెంబరు నెల అత్యధిక వర్షపాతం రికార్డులే. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉప్పునుంతల వద్ద మూడు ట్రాక్టర్లు దుందుభి వాగులో చిక్కుకుపోయాయి. కోడేరు మండలంలో రెండు ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం తిమ్మాపూర్‌ పెద్దవాగులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు.

ప్రధానంగా.. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్, యదాద్రి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్, నారాయణ పేట జిలాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాదు, భాగ్యనగరంలో టోలిచౌకి రిలయన్స్‌ మార్ట్‌ ఎదుట నడుంలోతు నీళ్లు చేరడంతో ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి. గుడిమల్కాపూర్ ప్రాంతంలో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు కుంగిపోయింది. యూసఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ, కృష్ణానగర్‌లను వరద ముంచెత్తింది. దుకాణాలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఖైరతాబాద్‌, చార్మినార్‌ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories