Top
logo

హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం

హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం
Highlights

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ...

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పది నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బలమైన ఈరుదుగాలులకు చాలా చోట్ల చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌, పంజాగుట్టా కూకట్ పల్లి, jntu ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది.

కృష్ణానగర్‌, యూసఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోకి చేరిన నీరును డబ్బాలతో తోడి పోశారు. దీంతో రాత్రంతా ప్రజలు జాగరణం చేయాల్సి వచ్చింది. పలు చోట్ల కరెంట్‌ పోవడంతో.. జనం ఇబ్బందులు పడ్డారు.

Next Story