Top
logo

నల్గొండలో కుండపోత..వందేళ్ల రికార్డ్ బ్రేక్

నల్గొండలో కుండపోత..వందేళ్ల రికార్డ్ బ్రేక్
Highlights

నల్గొండ గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కుంభవృష్టి కురిసింది. కేవలం 6 గంటల వ్యవధిలో ఏకంగా 200 మిల్లీ మీటర్ల ...

నల్గొండ గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కుంభవృష్టి కురిసింది. కేవలం 6 గంటల వ్యవధిలో ఏకంగా 200 మిల్లీ మీటర్ల వాన కురిసింది. నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన రాత్రి 11 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్న రీతిలో వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీని ప్రభావంతో నల్లగొండలో నిన్న అతిభారీ వర్షం కురిసింది. ఈ వానతో 119 ఏళ్ల క్రితం నమోదైన రికార్డు బద్దలైంది. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. విద్యుత్‌ సరఫరా నిలిపేశారు.

Next Story