Top
logo

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో భారీ వర్షాలు... సుర‌క్షిత ప్రాంతాల‌కు 5 వేల మంది

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో భారీ వర్షాలు... సుర‌క్షిత ప్రాంతాల‌కు 5 వేల మంది
X
Highlights

Heavy Rain In Warangal : రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు న‌దులన్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి.

Heavy Rain In Warangal : రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు న‌దులన్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరి పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు కట్టలు తెంచుకోవడంతో నీరంతా రోడ్లపైకి చేరి రాకపోకలన్నీస్థంబించిపోయాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని అధికారులు లోతట్టుప్రాంతాల్లో నివసించే 5 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. న‌దీకి స‌మీపంలోని ఏటూరునాగ‌రం గ్రామంలోని లోత‌ట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని త‌ర‌లించారు. ములుగు జిల్లాలోని రామ‌న్న‌గూడెం పుష్క‌ర్ ఘాట్ వ‌ద్ద గోదావ‌రి నేడు 9.90 మీటర్ల‌కు చేరింది.

లక్నవరం సరస్సు సైతం ఆరు అడుగుల ఎత్తులో పొంగిపొర్లుతోంది. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలోని ప‌లు గ్రామాల్లోని ఇండ్ల‌కు వ‌ర‌ద నీరు చేర‌డంతో అక్క‌డివారిని త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోని దూగొండి మండ‌లంలోని ముద్దునూర్ గ్రామానికి రోడ్డు కనెక్టివిటి తెగిపోయింది. నురుగు మండ‌లంలో ఆదివారం 23.36 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. తాడిచెర్ల‌, భూపాల‌ప‌ల్లి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ల్లో ఉత్ప‌త్తిని నిలిపివేశారు. కాళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి 11.74 మీట‌ర్ల‌కు చేరింది. మోరంచ వాగు, చ‌లి వాగు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. పాకాల చెరువు కూడా పొంగిపొర్లుతుంది. లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోవ‌డంతో వ‌రంగ‌ల్‌న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి 3 వేల మందికి పైగా పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

మంగ‌పేట మండ‌లంలోని గోదావ‌రి వెంట కొలువుదీరిన గ్రామాల నుంచి మ‌రో వెయ్యి మందిని త‌ర‌లించారు. జీడీ వాగుతో పాటు అనేక గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జ‌న‌గాం జిల్లాలోని చితకోదుర్ వాగు పొంగిపొర్లుతోంది. చారిత్రాత్మక రామప్ప ఆలయానికి సమీపంలో ఉన్న రహదారి వరద నీటిలో మునిగిపోయింది. పాలకూర్తి మండలంలోని బొమ్మెరా గ్రామంలో కురుస్తున్న వర్షం కారణంగా దండు రేణుక అనే మ‌హిళ‌ ఇల్లు కూలిపోయింది. మేడారం పుణ్య‌క్షేత్రం వెంట ప్రవహించే జంపన్న వాగు అనేక గ్రామాలను ముంచెత్తింది. ఈ త‌ర‌లింపు చ‌ర్య‌ను జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్వ‌ర్‌, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క ప‌ర్య‌వేక్షించారు. దీంతో వెంకటపూర్- గణపురం మండలాల మధ్య వాహనాల రాక‌పోక‌ల‌కు అంతరాయం ఏర్ప‌డింది.
Web TitleHeavy rain in warangal district 5000 people evacuated in erstwhile
Next Story