హైదరాబాద్ ను కుదిపేసిన భారీ వర్షం..ఎక్కడికక్కడ జామ్‌ అయిన ట్రాఫిక్‌

హైదరాబాద్ ను కుదిపేసిన భారీ వర్షం..ఎక్కడికక్కడ జామ్‌ అయిన ట్రాఫిక్‌
x
Highlights

హైదరాబాద్‌ మరోసారి స్తంభించిపోయింది. నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి కుదేలైంది. అసలే సాయంత్రం కావడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన...

హైదరాబాద్‌ మరోసారి స్తంభించిపోయింది. నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి కుదేలైంది. అసలే సాయంత్రం కావడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన ఉద్యోగులు, ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వరకు ఇటు కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్‌, దిల్‌షుక్‌ నగర్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ఇక ఎప్పట్లాగే హైటెక్‌ సిటీ పూర్తిగా స్తంభించింది. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చీబౌలీ, సైబర్‌ టవర్స్‌ ప్రాంతమంతా వాహనాలతో నిండిపోయింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో నరకం చూస్తున్నారు. గంటల గడుస్తున్నా వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులు తలపిస్తున్నాయి. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories