హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం
x
Highlights

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల నుంచి ఉరుముల శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు...

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల నుంచి ఉరుముల శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పగలంతా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు వర్షంతో సేద తీరారు. నగరంలో భారీ వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు సహా జూబిలీహిల్స్ లోని జవహర్ నగర్, కృష్ణానగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇక చేవెళ్లలో కేటీఆర్ నిర్వహించిన ఎన్నికల బహిరంగసభ వర్షంలోనే కొనసాగింది. కాగా రాత్రి 8 గంటలనుంచే భారీ ఉరుముల శబ్దాలతో జనాలు భయాందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories