దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు!

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు!
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందనే ఊహాగానాల నేపథ్యంలో అందరి చూపు దుబ్బాక ఫలితంపై పడింది

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందనే ఊహాగానాల నేపథ్యంలో అందరి చూపు దుబ్బాక ఫలితంపై పడింది. అయితే.. ఇదే సమయంలో బెట్టింగ్‌లు కూడా అదే స్థాయిలో జోరందుకున్నాయి. ఒక్క దుబ్బాక స్థానంపైనే కోట్లలో బెట్టింగ్‌ నడుస్తున్నట్టు తెలుస్తోంది..

దుబ్బాక బై ఎలక్షన్ పోలింగ్ ముగిసి వారం రోజులైనా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ పైనే డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా దుబ్బాక పై భారీ అంచనాలు పెరిగాయి. దుబ్బాక బైపోల్ ఫలితాలకు ఇంకొన్ని గంటలే మిగిలి ఉండడంతో.. నిమిష నిమిషానికి ఉత్కంఠ పెరుగుతోంది.

దుబ్బాకలో మొదటి నుంచి అధికార పార్టీ గెలుపు ధీమాతో ఉంది. అయితే.. సడెన్‌గా బీజేపీ రంగంలోకి దిగింది. దాంతో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉందని అంచనాలున్నాయి. అయితే.. ఇదే సమయంలో దుబ్బాక బైపోల్ రిజల్ట్స్ పై జోరుగా బెట్టింగ్‌లు కడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై పోటాపోటీగా పందాలు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రెండు పార్టీలకు అనుకూలంగా రావడంతో.. బెట్టింగ్ రాయుళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. దుబ్బాకలో ఎవరు గెలుస్తారు..? గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది..? ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంటుంది..? ఏయే మండలాల్లో ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక సిగ్మెంట్‌తో పాటు సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో జోరుగా పందాలు కాస్తున్నారు. ప్రతి రౌండ్‌పై కూడా బెట్టింగ్ కాస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మిరుదొడ్డి, చేగుంట, నార్సింగ్, తోగుట్ట, రాయ్‌పోల్, దౌల్తాబాద్, దుబ్బాక మండలాల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఆయా పార్టీల గెలుపు ఓటములపై కొందరు బెట్ కడుతుండగా, మరికొందరు, గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై బెట్లు కడుతున్నారు. వారివారి స్థాయిని బట్టి వెయ్యి రూపాయలు మొదలుకుని లక్షల రూపాయల వరకు బెట్‌ కస్తున్నారు. చాలా చోట్ల క్యాష్ రూపంలో పందేలు కాస్తుండగా, కొందరు పందెం గెలిస్తే మందు పార్టీ ఖాయమని ఒప్పందాలు చేసుకుంటున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలపై కోట్లలో బెట్టింగ్‌ కాస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. మరోవైపు బీజేపీ పై భారీ అంచనాలు పెరగడం వల్లనే బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లోనే తెరపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories