Supreme Court: పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా?: సుప్రీం

Supreme Court: పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా?: సుప్రీం
x
Highlights

Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు తెలిపారు.

Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు తెలిపారు.

బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున సుందరం, శేషాద్రి నాయుడు కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని కోర్టుకు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా అతను ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని బీఆర్ఎస్ న్యాయవాది తెలిపారు. ఈ విషయాలపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది గుర్తు చేశారు.

నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. తగిన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేవరకా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ఉన్నత న్యాయస్థానం అడిగింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా అని కోర్టు అడిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు ధర్మాసనం వ్యాఖ్యలను చేసిన తర్వాతే నోటీసులిచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.. కానీ, నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. తాము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ ఇంకా షెడ్యూల్ చేయలేదన్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ స్పందించాు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో పార్టీ ఫిరాయింపు విషయంలో ఎప్పటిలోపుగా తేల్చాలనే దానిపై గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని.. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్లగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories