తెలంగాణలో కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్

corona vaccination launched by etela rajender in Hyderabad
x

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Highlights

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత 139 కేంద్రాల్లోనే టీకా కార్యక్రమం నిర్వహిద్దామని ప్రభుత్వం అనుకున్నప్పటికీ.. నిమ్స్‌లో కూడా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య 140కి పెరిగింది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. దుష్ప్రభావాలు కలిగితే చికిత్స చేయడానికి వ్యాక్సిన్‌ కేంద్రంలో అందుబాటులో వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల్లో తొలి రోజు వ్యాక్సిన్‌ తీసుకునే 30 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వారి సెల్‌‌ఫోన్‌లకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మేసేజ్‌లు వెళ్లాయి. గాంధీలో టీకా తీసుకునే 30 మంది లబ్ధిదారుల్లో 50 శాతం పారిశుధ్య కార్మికులు, 25 శాతం పారామెడికల్‌ సిబ్బంది, మరో 25 శాతం వైద్య సిబ్బంది ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల రాజేందర్‌, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తొలి రోజు కోవిడ్‌ టీకా తీసుకోనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories