సిద్ధిపేట కోమటి చెరువువద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు

సిద్ధిపేట కోమటి చెరువువద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న హరీశ్ రావు

Rama Rao
Published on: 4 Oct 2022 6:31 AM IST
Harish Rao with his family members Participated in Bathukamma celebrations Siddipet
X

సిద్ధిపేట కోమటి చెరువువద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు

Harish Rao: ప్రకృతిని ప్రేమించడం, పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ సొంతమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట కోమటి చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మవేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసిపాల్గొన్నారు. కాలక్రమంలో సిద్ధిపేట రూపురేఖలు మార్చడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని అభినందించారు. కోమటి చెరువును సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడం వెనుక అధికారుల కృషి ఉందన్నారు. సద్దుల బతుకమ్మవేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు, కుటుంబసభ్యులు, ప్రభుత్వ అధికారులతో కలిసి కోమటివాని చెరువులో కాసేపు జలవిహారం చేశారు. వాటర్ బోట్‌ను హరీశ్ రావు స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story