Harish Rao: బాల్క సుమన్‌తో హరీష్ రావు ములాఖత్

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అరెస్టై రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్‌కు బయలుదేరారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 Feb 2026 11:12 AM IST
Harish Rao: బాల్క సుమన్‌తో హరీష్ రావు ములాఖత్
X

Harish Rao: బాల్క సుమన్‌తో హరీష్ రావు ములాఖత్

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అరెస్టై రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన తన పర్యటనను ప్రారంభించారు.

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లు ఈ అరెస్టుకు దారితీశాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో నమోదైన కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.

పార్టీ నేత అరెస్టును నిరసిస్తూ, ఆయనకు నైతిక మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు స్వయంగా జైలుకు వెళ్లి ములాఖత్ కానున్నారు. ఈ పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story