Harish Rao: ప్రతి ఒక్కరూ ఒక గంట యోగా చేయాలి

Harish Rao Suggested that Everyone will be Healthy if they do Yoga for an Hour a Day
x

Harish Rao: ప్రతి ఒక్కరూ ఒక గంట యోగా చేయాలి

Highlights

Harish Rao: ఒకసారి బీపీ, షుగర్ వస్తే జీవితాంతం భయపడాలి

Harish Rao: ప్రతి ఒక్కరూ రోజుకు ఓ గంట పాటు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని మంత్రి హరీష్ రావు సూచించారు. ఒక సారి బీపీ, షుగర్ వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని మంత్రి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రికెట్ స్టేడియంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జెడ్‌పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. పెద్ద పెద్ద ఆస్పత్రులు కట్టడంతోనే ఆరోగ్య తెలంగాణ కాదని, ప్రజలు ఆస్పత్రులకు వెళ్లకుండా ఉన్నప్పుడే ఆరోగ్య తెలంగాణ వచ్చినట్లని మంత్రి హరీష్ అన్నారు. పచ్చదనం పెంపొందించడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories