జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలబడిన మంత్రి

టేక్మాల్ మండల రిపోర్టర్ పిండి లింగం అనారోగ్యంతో కొద్దికాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే.

S. Srikanth
Published on: 28 Nov 2019 3:05 PM IST
జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలబడిన మంత్రి
X
మంత్రి హరీష్ రావు

టేక్మాల్: టేక్మాల్ మండల రిపోర్టర్ పిండి లింగం అనారోగ్యంతో కొద్దికాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే. లింగం మరణించిన తరువాత కుటుంబం పోషణ గడవడం గగనం అయిందని, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని కుటుంబ సభ్యులు ఆశ్రయించగా, మంత్రి హరీష్ రావుని ఎమ్మెల్యే కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

హరీష్ రావు ఉన్నత అధికారులతో మాట్లాడి లింగం భార్యకు టేక్మాల్ మండల జూనియర్ కాలేజ్ లో ఔట్ సోర్సింగ్ జాబ్ కల్పించడంతో పాటు, అర్ధాంతరంగా ఆగిపోయిన తన బాబు చదువు గూర్చి తెలుసుకుని, తనను కాలేజ్ లో రీ - జాయిన్ చేపించడమే కాకుండా, పై చదువులకు కావల్సిన సహాయం చేస్తానని మంత్రి అన్నారు. కుటుంబం గడవడం కష్టమై ఇబ్బందులు పడుతున్న మా కుటుంబానికి, అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story