Harish Rao: అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖ

Harish Rao Seeks Water Release To Mallanna Sagar And Other Reservoirs Siddipet District
x

Harish Rao: అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖ

Highlights

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు నీళ్లు లేక అడుగంటుతున్నాయన్నారు. ఒకవైపు రిజర్వాయర్‌లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని లేఖలో తెలిపారు. పంటలు వేయాలా..? వద్దా..? అనే అయోమయంలో ఆవేదన చెందుతున్నారని వివరించారు.

గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీరు ఉంటే.. ప్రస్తుతం 0.75 టీఎంసీల నీరు ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌కు నీటిని పంపింగ్‌ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి అయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఉత్తమ్‌ను కోరారు హరీష్‌రావు.


Show Full Article
Print Article
Next Story
More Stories