Harish Rao: కేసీఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగం

Harish Rao Says CM KCR Rule Was Golden Era For Telangana
x

Harish Rao: కేసీఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగం

Highlights

Harish Rao: బీడీ కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్

Harish Rao: కేసీఆర్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగమని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పెంచారని అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారాయన.. కాంగ్రెస్ సర్కారు హయాంలో తెలంగాణలో 29 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చే వారని, ప్రస్తుతం 44 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారని అన్నారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి 21 మెడికల్ కాలేజీలు తెచ్చామని, ఒక్కో కాలేజీ కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు హరీశ్ రావు... పుట్టుక నుంచి చివరి మజిలీ దాకా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కోసం పాటు పడుతున్నామని, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో ఇంటి వద్దే వైద్యమందిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కేవలం మూడు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories